schedule Thursday, July 09, 2026

భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉన్‌ నబీ

calendar_today September 5, 2025
person dharshininews
భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉన్‌ నబీ
భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉన్‌ నబీ - పురవీదుల్లో ఆకట్టుకున్న శాంతి ర్యాలీ - అలరించిన మహమ్మద్ ప్రవక్త కీర్తనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉల్ నభి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలీం ఆధ్వర్యంలో జమాలియా మిలాద్ ఉన్న నబి సెలబ్రేషన్స్ సోసైటీ అధ్యక్షులు యూసుఫ్ సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వీదుల్లో శాంతిర్యాలీ చేపట్టారు. kvcs ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కీర్తనలు ఆలాపించారు. పాత తాండూరుతో పాటు పట్టణంలోని పురవీదుల్లో ర్యాలీ కొనసాగింది. పుర వీదుల్లో కొనసాగిన ర్యాలీలో తాండూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు ముస్లిం యువనాయకులు మహమ్మద్ ముజ్జు, మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో పాత తాండూరు తెలుగు గడ్డ వద్ద శీతల పానియాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సయ్యద్ అక్తర్ అలీ, రహీం, మహమ్మద్ జావిద్ ఖాన్ తౌ సిఫ్, ఫజల్ మహమ్మద్, అజీజ్ ఖాన్, మత పెద్దలు, ముస్లి సొదరులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38416/