schedule Wednesday, September 09, 2026

సాయిమేధలో టీచర్స్ డే

calendar_today September 6, 2025
person dharshininews
సాయిమేధలో టీచర్స్ డే
సాయిమేధలో టీచర్స్ డే - ఉపాధ్యాయులకు సన్మానం - సత్కరించిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చక్కటి సంస్కృతి సంప్రదాయంతో చదువు నేర్పే గురువులకు పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన కృష్ణవేణి, అనిత, మహేశ్వరి ఉపాధ్యాయు రాళ్లను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు మంజులరెడ్డి, కల్పన, ప్రిన్సిపల్ సజిత, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్ గౌడ్, అభిలాష్ రెడ్డి, సునీత, శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38433/