schedule Sunday, July 05, 2026

ఆర్అండ్‌బీ రోడ్లపై ప్రత్యేక దృష్టి

calendar_today September 8, 2025
person dharshininews
ఆర్అండ్‌బీ రోడ్లపై ప్రత్యేక దృష్టి
ఆర్అండ్‌బీ రోడ్లపై ప్రత్యేక దృష్టి - పనులు పూర్తయ్యేందుకు సహాకారం - మంత్రి కోమటిరెడ్డితో ఎమ్మెల్యే మనోమర్ రెడ్డి భేటి - నియోజకవర్గ రోడ్ల పనులపై సమీక్ష kvcs తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ఆర్అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ఆర్అండ్‌బీ ద్వారా చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులపై సమీక్షించారు. రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు మంత్రి వెంకట్ రెడ్డి స్పందిస్తూ రోడ్ల ప్రగతికి పూర్తి సహాకారం అందిస్తామని భరోసా అందించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్‌బీ శాఖ సీఈ మోమన్ నాయక్ ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38459/