schedule Sunday, July 05, 2026

యూరియా కష్టాలు.. సర్కారుకు సిగ్గుచేటు..!

calendar_today September 10, 2025
person dharshininews
యూరియా కష్టాలు.. సర్కారుకు సిగ్గుచేటు..!
యూరియా కష్టాలు.. సర్కారుకు సిగ్గుచేటు..! - రైతన్నలను పస్తులుంచే పాపం ప్రభుత్వానిదే - తెలంగాణలో కాంగ్రెస్ పాలన వైఫల్యం - బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ - బారులు తీరిన రైతులకు పండ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రైతులను యూరియా కోసం బారులు తీరేలా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఉదయం నుంచే అన్నదాతను పస్తులు పాలు చేసిన పాపం ఈ ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు నూలి శభప్రద్ పటేల్ విమర్శించారు. kvcs బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె సహాకార సంఘం కార్యాలయం వద్ద యూరియా బస్తాల కోసం బారులు తీరిన రైతులను శుభప్రద్ పటేల్ పలకరించారు. ఉదయం నుంచి తిండి తిప్పలు మాని పస్తులు ఉన్న రైతులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కార్యాలయంలో 'రైతుల కోసం అందుబాటులో ఉన్న యూరియా బస్తాల నిల్వలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా బస్తాల కొరత ఏర్పడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రైతులకు యూరియా కష్టాలు రాకుండా చూశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్డు ఎక్కేలా, బారులు తీరేలా పరిస్థితులు తీసుకరావడం సిగ్గుచేటన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు తిండి తిప్పలు మాని పస్తులుంచేలా చేసిన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలలో యూరియా బస్తాలు నిల్వ ఉంచుకుని, రైతులను పడిగాపులు పడేలా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా బస్తాలను అందించాలని, లేదంటో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భాను. ఆబీద్ చావుస్, సాయికుమార్, మల్లేశం. శ్రీధర్. మనోహర్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38499/