schedule Wednesday, September 09, 2026

తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ..!

calendar_today September 10, 2025
person dharshininews
తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ..!
తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ..! - ఆమె స్పూర్తితో బీసీ రిజర్వేషన్ల పోరాటం - జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ - బీసీ సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మకు ఘన నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జమీందారుల అనుచరులకు ఎదురోడ్డి రైతాంగ మహిళలకు ధైర్యాన్ని నూరిపోసిన దీరవనిత చాకలి ఐలమ్మ అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. kvcs బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణం వీవీహెచ్ఎస్‌ స్కూల్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే బీసీలకు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. జమీందారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా తిరగబడి తెలంగాణ రైతాంగ పోరాటానికి మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. ఆమె ధైర్యసాహసాలు అనేకమందికి ప్రేరణగా మారి సమానత్వం సామాజిక న్యాయం కోసం ఉద్యమానికి దిశ చుపాయని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని నేడు బీసీ సమాజం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్లను అమలుకై పోరాడవలసిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా చాకలి ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, బీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బిసి సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, మంతటి రాజు, చాకలి బిచప్ప, ప్రభాకర్ గౌడ్, నాయీ అనిల్ కుమార్, శ్రీనివాస్, విగ్నేష్, హరికృష్ణ, మల్లేష్, వివేక్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38501/