schedule Thursday, September 10, 2026

విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!

calendar_today September 16, 2025
person dharshininews
విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!
విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..! - చీఫ్ విప్, ఎమ్మెల్యేలకు ఆహ్వానం - తాండూరు విశ్వబ్రాహ్మణ సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో జరిగే విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రావాలని తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డిలను విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం నాయకులు కోరారు. kvcs మంగళవారం హైదరాబాద్ లో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డిలను సంఘం ప్రతినిధులు గద్దె శ్రీనివాస్ చారి, సంగమేష్ చారి, లక్ష్మణ్ చారి, కందనెల్లి శ్రీనివాస్ చారిలు వారి వారి నివాసాల్లో మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని కందనెల్లి గుట్ట వద్ద విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోమం, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సంర్భంగా తాండూరులో జరిగే విశ్వకర్మ ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతామని చెప్పినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38613/