schedule Sunday, July 05, 2026

తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలి

calendar_today September 16, 2025
person dharshininews
తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలి
తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలి - కాగ్నా పంపుహౌస్ ద్వారా నీరు సరఫరా చేయాలి - మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని మున్సిపల్ పరిధి గాంధీనగర్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. kvcs మంగళవారం కాలనీ మహిళలతో కలిసి ఆమె మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు నిలిపిపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయంగా కాగ్నానది పంపుహౌస్ ఉన్నా అధికారులు దాని వినియోగంపై దృష్టిసారించడం లేదన్నారు. తాగునీటికి తాండూరు కాగ్నానది వరం లాంటిదని అన్నారు. ఈ పంపుహౌస్ మరమ్మత్తులకు గత కౌన్సిల్ లో నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తుచేశారు. పైపులైన్ మరమ్మత్తులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వ వాంచారని ఆరోపించారు. పట్టణానికి చెంతనే కాగ్నానది ఉన్న ప్రజలకు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు మరమ్మత్తులపై దృష్టిసారించాలని, తాండూరు కాగ్నానది పంపుహౌస్ నుంచి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అవసరాలకు అనుగుణంగా నీరు సరఫరా చేయాలని అన్నారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38615/