schedule Sunday, July 05, 2026

సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం

calendar_today September 17, 2025
person dharshininews
సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం
సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం - వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన నాయకులు - సర్దార్ వల్లభాయ్‌ పటేల్ యూత్ అసోసియేషన్, బీసీ సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం కలిగిందని తాండూరు సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ క్లబ్, బీసీ సంఘం సంఘం నాయకులు అన్నారు. kvcs బుధవారం అసోసియేషన్, బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తోడు కావడంతో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడించారని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోరాటం గుర్తుండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అసోసియేషన్ క్లబ్ సభ్యులు కోటం సిద్ధలింగం, గడ్డం వెంకటేష్, రాంబో రాజ్ కుమార్, అజయ్ కుమార్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, బస్వరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38629/