schedule Sunday, July 05, 2026

ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

calendar_today September 17, 2025
person dharshininews
ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు - పాల్గొన్న చీఫ్ విప్ మ హేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పెద్దేముల్ మండలం కందనెల్లి సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. kvcs విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో తెలంగాణ చీఫ్ విప్ మ హేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు వేరువేరుగా పాల్గొన్నారు. మహాయజ్ఞంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ భగవాన్ ప్రంపచానికి ఆదర్శమన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, నాయకులు సర్దార్ ఖాన్, మహిపాల్ రెడ్డి, సీనీయర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి, సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ చారి, వినోద్ కుమార్ చారి, రవి కుమార్ చారి, బాలకృష్ణ చారి, నరేందర్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38631/