schedule Wednesday, September 09, 2026

కేవీసీఎస్‌లో బతుకమ్మ సంబరాలు..!

calendar_today September 20, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో బతుకమ్మ సంబరాలు..!
కేవీసీఎస్‌లో బతుకమ్మ సంబరాలు..! - ఆడిపాడిన విద్యార్థులు, టీచర్లు - ఆకట్టుకున్న దసరా పండగ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసీ.. పువ్వేసీ.. చందమామా.. అంటూ తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలతో పాటు ముందస్తు దసరా వేడుకలు అంబరాన్నేంటేలా జరుపుకున్నారు. శనివారం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. kvcs ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్టించిన దుర్గామాతకు పూజలు నిర్వహించి.. బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ విద్యార్థులు, మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు ఉత్సహాంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలకు లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉత్సహంగా సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు ముందస్తు దసరా సంబరాలను కూడా అట్టహాసంగా నిర్వహించారు. దుర్గామాతను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అమ్మవారి మహిమలను చాటుతూ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. అదేవిధంగా దసరా ఉత్సవాలో రావణ సంహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాణా సంచాలు పేలుస్తూ వేడుకలసు సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరు గౌరవి ంచాలన్నారు. అదేవిధంగా విజయదశమి విజయానికి ప్రతీగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్, టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38688/