schedule Wednesday, September 09, 2026

బీఎస్ఆర్ మంచి మనుసు..!

calendar_today September 24, 2025
person dharshininews
బీఎస్ఆర్ మంచి మనుసు..!
బీఎస్ఆర్ మంచి మనుసు..! - యువకుడి వైద్య ఖర్చులకు సాయం - యువనాయకుడి ద్వారా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరోసారి మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యానికి గురై మంచాన పడిన ఓ యువకుడికి వైద్య ఖర్చుల కోసం సాయం అందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం జీవనీ గ్రామానికి చెందిన జగదీశ్వర్ అనే వ్యక్తి కుమారుడు ఓంకార్ అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో బుధవారం శ్రీనివాస్ రెడ్డి బాధిత యువకుడి వైద్య ఖర్చుల కోసం రూ.10వేల అందజేశారు. స్వయంగా కాకుండా కాంగ్రెస్ యువనాయకులు రాజవర్ధన్ రెడ్డి ద్వారా బాధిత యువకుడి తండ్రికి అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రాజవర్ధన్ రెడ్డి ద్వారా ధైర్యం చెప్పారు. ఇందుకు యువకుడి తండ్రి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38771/