schedule Thursday, September 10, 2026

భద్రేశ్వరుని సన్నిధిలో బతుకమ్మ సంబరాలు..!

calendar_today September 24, 2025
person dharshininews
భద్రేశ్వరుని సన్నిధిలో బతుకమ్మ సంబరాలు..!
భద్రేశ్వరుని సన్నిధిలో బతుకమ్మ సంబరాలు..! - ఉత్సహాంగా ఆడిపాడిన మహిళలు, యువతులు - రేనవేవేషన్ కమిటి ఆధ్వర్యంలో ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలను తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయ సన్నిధిలో అంబరాన్నంటేలా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ సంబరాలలో భాగంగా దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, కమిటి సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మహిళలు, యువతులు, చిన్నారులు తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణంలో బతుకమ్మను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఒక్కేసి.. పువ్వేసీ.. చందమామ అంటూ సాగే బతుకమ్మ పాటలకు లయబద్ధంగా ఆడిపాడారు. బతుకమ్మ చుట్టూ చప్పట్లతో సాగిన ఆట పాటలు మార్మోగాయి. మహిళలు, యువతులు కొలాటం ఇతర నృత్యాలతో ఆకట్టుకున్నారు. kvcs ఈ సందర్భంగా రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండగ అని అన్నారు. ప్రతి యేడాది తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా పండగ సంబరాలను ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, సమాజం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38782/