schedule Sunday, July 05, 2026

కొమురవెల్లి మల్లన్న సన్నధిలో బంటు మల్లప్ప

calendar_today September 26, 2025
person dharshininews
కొమురవెల్లి మల్లన్న సన్నధిలో బంటు మల్లప్ప
కొమురవెల్లి మల్లన్న సన్నధిలో బంటు మల్లప్ప - వేములవాడ, భద్రాద్రి, అన్నవరంలో స్వామి వార్ల దర్శనం - మిత్ర బృందంతో కలిసి పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సిద్దపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న స్వామిని తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప దర్శించుకున్నారు. బంటు మల్లప్ప తన మిత్రబృందంతో కలిసి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో మల్లన్న స్వామిని దర్శించుకుని అందరిని సల్లంగా చూడాలని వేడుకున్నారు. అదేవిధంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి, భద్రాదిలో సీతారాములను, అన్నవరంలో సత్యనారాయణ స్వామిలను కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బంటు మల్లప్ప మాట్లాడుతూ దైవ చింతనలో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని అన్నారు. అందరు ఆధ్యాత్మిక ధోరణిని అలవర్చుకోవాలన్నారు. దైవ కృపతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38810/