వర్షానికి కూలిన ఇళ్లు..!
September 27, 2025
dharshininews
వర్షానికి కూలిన ఇళ్లు..!
- యాలాల మండలంలో ఘటన
- ఆదుకోవాలని బాధితురాలి వేడుకోలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షానికి ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘటన యాలాల మండలం ముకుందాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కేతావత్ దేవమ్మ కూలీ పనులు చేస్తూ తనకున్న ఇంట్లో జీవనం సాగిస్తుంది. కొన్నినెలల క్రితమే భర్త చనిపోయాడు. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆమె ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న వస్తువులు ద్వంసమయ్యాయి. ఎలాంటి ఆధారం లేని తనకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితురాలు కేతావత్ దేవమ్మ కోరుతోంది.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38828/