schedule Wednesday, September 09, 2026

తాండూరులో మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం

calendar_today September 27, 2025
person dharshininews
తాండూరులో మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం
తాండూరులో మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం - కేటగిరీల వారిగా దుకాణాల కేటాయింపు నిర్ణయం - దరఖాస్తు దారులు పాటించాల్సిన నిబంధనలు ఇవే - కేటాయింపు పద్దతి, దుకాణాల గడువు వివరాలు ఇలా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో మద్యం దుకాణాలకు దరకాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ ఆదిశేషిరెడ్డి తెలిపారు. తాండూరు డివిజన్‌ పరిధిలో దుకాణాల కేటాయింపు, దరఖాస్తుల దారుల నిబంధనలను శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు ఎక్సైజ్ శాఖ పరిధిలో మొత్తం 18 దుకాణాల కోసం దరఖాస్తులను కోరడం జరుగుతుందని అన్నారు. ఇందులో ఎస్సీవర్గాలకు తాండూరు పట్టణంలో-3, కోట్పల్లిలో 1, మల్కాపూర్లో-1, గౌడ్ల వర్గాలకు తాండూరు పట్టణంలో -1, సామాజిక వర్గాలకు మిగతా దుకాణాలు కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. kvcs దరఖాస్తులు సమర్పించే వారు ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ ఫీజు రూ. 3లక్షలు చెల్లించాలని, వచ్చే నెల 18వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వచ్చేనెల 23న డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని, కొత్త దుకాణాలకు 2025 నుంచి 2027 డిసెంబర్ 1 వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని అసక్తిగల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38835/