schedule Sunday, July 05, 2026

రేపు సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు

calendar_today September 29, 2025
person dharshininews
రేపు సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు

రేపు సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు - హాజరు కానున్న  మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - మున్సిపల్ మాజీ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డ్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తెలిపారు. రేపు మంగళవారం సాయిపూర్‌లోని తాత గుడి ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ వేడుకలకు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన సతీమణి ఆర్తి రెడ్డి హాజరవుతున్నారని వెల్లడించారు. కావున తాండూరు పట్టణంలో వాడ వాడా నుండి మహిళలందరూ అధికసంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38824/