schedule Sunday, July 05, 2026

అమల్లోకి ఎన్నికల కోడ్..!

calendar_today September 29, 2025
person dharshininews
అమల్లోకి ఎన్నికల కోడ్..!
అమల్లోకి ఎన్నికల కోడ్..! - అంతకుమించి డబ్బులుంటే సీజ్ - అభివృద్ధి పనులపై ఆంక్షలు - మరిన్ని ఎన్నికల నిబంధనలు ఇవే హైదరాబాద్‌, దర్శిని ప్రతనిధి : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. కోడ్ ముగిసే వరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలున్నాయి. సరైన పత్రాలు లేని నగదును అధికారులు సీజ్ చేసి, ఐటీ అధికారులకు సమాచారం అందిస్తారు. ప్రజలు తగిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు. kvcs ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే.. ఎన్నికల అధికారులు ఐటీ, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన పత్రాలు ఉంటేనే అనుమతి అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ పత్రాలను చూపించగలిగితే.. జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. అధికారులకు చూపించాల్సిన ఆధారాలు: బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటి. వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు. ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు. వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలి. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38863/