schedule Sunday, July 05, 2026

పులకించిన సాయిపూర్..!

calendar_today September 30, 2025
person dharshininews
పులకించిన సాయిపూర్..!
పులకించిన సాయిపూర్..! - పట్లోళ్ల ఆధ్వర్యంలో సంబరాలు అదరహో - బతుకమ్మ ఆడిన దీపా నర్సింలు, మహిళలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పూల పండగ అంటే ఇదేనే అనేలా తాండూరు పట్టణం సాయిపూర్ పులకించిపోయింది. మంగళవారం సాయిపూర్లోని 9వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తాతగుడి సమీపంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు, యువతులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు పట్లోళ్ల దీపా నర్సింలు అందంగా పేర్చిన బతుకమ్మను తయారు చేసి తీసుకవచ్చారు. అదేవిధంగా సాయిపూర్ తో పాటు పలు ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా బతుకమ్మల తీసుకవచ్చి మద్యలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బతుకమ్మ చుట్టు సీతాకోకచిలుకల్లా.. ఇంద్రదనస్సులోని వర్ణాలకు మించి రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతూ... మురిసిపోతూ ఆట పాటలతో ఉర్రూతలూగించారు. అనంతరం బతుకమ్మలను కాగ్నానదికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38897/