schedule Thursday, September 10, 2026

కదులుతున్న రైలు ఎక్కబోయి...!

calendar_today October 1, 2025
person dharshininews
కదులుతున్న రైలు ఎక్కబోయి...!
కదులుతున్న రైలు ఎక్కబోయి...! - ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు - తాండూరు రైల్వ స్టేషన్ పరిధిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ హెడ్‌ కానిస్టేబుల్ అదుపుతప్పి రైలుకింద పడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన బుధవారం తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బెంగులూరుకు చెందిన మారుతి హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తాండూరులో బెంగులూరు వెళ్లేందుకు వచ్చారు. kvcs అప్పటికే యశ్వంత్ పూర్ రైలు ముందుకు కదలడంతో మారుతి రైలు ఎక్కేందుకు పరిగెత్తారు. రైలు కదులుతుండడంతో ఆయన అదుపుతప్పి పడిపోయారు. ఈక్రమంలో ఆయన రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38902/