schedule Sunday, July 05, 2026

శక్తి స్వరూపం.. శమి వృక్షం..!

calendar_today October 1, 2025
person dharshininews
శక్తి స్వరూపం.. శమి వృక్షం..!
శక్తి స్వరూపం.. శమి వృక్షం..! - దేవాలయాల్లో జమ్మి చెట్టు శుభకరం - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శమి వృక్షం.. శక్తి స్వరూపమే అని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం శరన్నవరాత్రుల సందర్భంగా తాండూరు పట్టణంలోని కాళికాదేవి దేవాలయం, రాఘవేంద్ర స్వామి దేవాలయం, అంతారం మార్గంలోని దేవాలయాలతో పాటు పలు దేవాలయాల్లో జమ్మి చెట్టును నాటారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య స్వప్న పరిమళ్ దేవాలయాలలో జమ్మి చెట్టును నాటి పూజించారు. అంతకుముందు ఆయా దేవాలయాల్లో అమ్మవార్లను, స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాణాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. జమ్మి పూజతోనే శరన్నవరాత్రులు పరిపూర్ణం అవుతాయన్నారు. kvcs జమ్మిచెట్టును పూజించడం సకలా శుభాలను కోరుకోవడమే అని అన్నారు. ప్రతి గుడిలో జమ్మి చెట్టును దర్శించుకుని.. పూజించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో దేవాలయాల కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38919/