schedule Thursday, September 10, 2026

రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీనివాస్ రెడ్డి

calendar_today October 3, 2025
person dharshininews
రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీనివాస్ రెడ్డి
రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీనివాస్ రెడ్డి - సీఎంకు దసరా శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు నియోజకవర్గ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి కలిశారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి విజయ దశమి శుభకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తాండూరు రాజకీయ పరిస్థితులను శ్రీనివాస్ రెడ్డిని అడిగితెలుసుకున్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డితో శ్రీనివాస్ రెడ్డి తాండూరు రాజకీయాలతో పాటు అభివృద్ధి గురించి చర్చించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాలపై ఆసక్తిని పెంచింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38924/