schedule Saturday, July 04, 2026

ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..!

calendar_today November 6, 2025
person dharshininews
ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..!
ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..! - మహిళా మీదకు దూకిన కుక్కలు - చెదరగొట్టి కాపాడిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉరికే నడుచుకుంటూ వెలేదామంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్నారులు, మహిళలపైకి వీధి కుక్కలు ఎగబడుతున్నాయి. గురువారం తాండూరు పట్టణంలో ఓ మహిళ పైకి కుక్కలు దాడికి యత్నించాయి. పట్టణంలోని 26 వార్డు గుమాస్తా నగర్లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు మీద ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా ఆ మహిళ మీదకు దూసుకెళ్ళాయి. kvcs అప్రమత్తం అయిన స్థానికులు వెంటనే వాటిని తరిమికొట్టారు. దీంతో మహిళ ఊపిరి పీల్చుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటనపై ప్రజలు అధికారులపై విమర్శలు చేస్తున్నారు. వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.   వీడియో [video width="848" height="478" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2025/11/VID-20251106-WA0778.mp4"][/video]   ఇది కూడా చదవండి...   https://www.dharshininews.com/39454/