schedule Monday, September 07, 2026

పుర పోరుకు సిద్దమైన గడ్డలి పరిమళ రవీందర్

calendar_today January 28, 2026
person dharshininews
పుర పోరుకు సిద్దమైన గడ్డలి పరిమళ రవీందర్
పుర పోరుకు సిద్దమైన గడ్డలి పరిమళ రవీందర్ - బీఆర్ఎస్ నుంచి పోటీకి నామీనేషన్ దాఖలు - వారం రోజులుగా ప్రజల మద్య ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ మరోసారి పుర పోరుకు సిద్దమయ్యారు. బుధవారం తాండూరు మున్సిల్‌ కార్యాలయంలో కౌన్సిలర్ పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని 23వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేయబోతున్నారు. రాజకీయాల్లో పరిమళ, ఆమె భర్త రవీందర్‌లు ఉన్నారు. ఇటీవలే వారి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 23వ వార్డుజనరల్ రిజర్వు కావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిమళ పోటీకి సిద్దమయ్యారు. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన పరిమళ ప్రజల మన్నన్నలను పొందారు. వార్డులో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు సీసీ రోడ్లు, మురుగు కాలువలు అభివృద్ధి పనులు చేయించారు. ప్రజలకు అండగా ఉండడంతో.. వారి ఆదరణలో మరోసారి బల్దియా బరిలో నిలుస్తున్నారు. వారం రోజులుగా పరిమళ వార్డులతో కలిసి.. వారి మద్యనే ఉంటూ ప్రచారం ప్రారంభించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40762/