schedule Saturday, July 04, 2026

ట్రాఫిక్ పోలీసులకు చల్లని సాయం

calendar_today April 22, 2026
person dharshininews
ట్రాఫిక్ పోలీసులకు చల్లని సాయం
ట్రాఫిక్ పోలీసులకు చల్లని సాయం - టోపీలు, వాటర్‌ బాటిళ్లు, కూలింగ్‌ గ్లాసెస్‌ - డీఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎండలో విధులు నిర్వహించే తాండూరు పట్టణ ట్రాఫిక్ పోలీసులకు లయన్స్ క్లబ్ సభ్యులు చల్లని సాయం అందజేశారు. ఎండలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్.శరణు బసప్ప ఆధ్వర్యంలో క్లబ్ తరుపున పలు వస్తువులు అందజేశారు. బుధవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య చేతుల మీదుగా లయన్స్ క్లబ్ ద్వారా టెంపరేచర్ వాటర్ బాటిళ్లు, కూలింగ్ గ్లాసెస్, టీపీలను అందజేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ లయన్స్ సభ్యులు ట్రాఫిక్ పోలీసుల సంరక్షణకై అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర గౌడ్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు, లయన్స్ క్లబ్ కోశాధికారి గౌరీ శంకర్, సల్లా దామోదర్, ఓం ప్రకాష్ సోమాని, వై.బసనప్ప, గూలి శివకుమార్, సంగప్ప తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43164/