schedule Sunday, September 06, 2026

తాండూరులో భారీ వర్షం

calendar_today June 15, 2026
person dharshininews
తాండూరులో భారీ వర్షం
తాండూరులో భారీ వర్షం - ఎంసీహెచ్‌ ఆసుపత్రి వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం - యాలాలలో ఈదురు గాలులు, విరిగిన చెట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత వర్షం ప్రారంభమయ్యింది. దాదాపు అరగంట వరకు వర్షం కురిసింది. గాలి వానతో కురిసిన వర్షంతో పట్టణంలోని కాలనీలు తడిసిపోయాయి. ఈదురు గాలులతో పడిన వర్షం వల్ల నేరుగా ఇండ్లలోకి వర్షపు చినుకులు దంచికొట్టాయి. భారీ వర్షంతో పట్టణంలోని మురుగుగ కాలువలు పొంగిపొర్లాయి. రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకున్నాయి. భారీ వర్షం వల్ల తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్‌) సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్‌ స్థంబం విరిగి పడింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు యాలాల మండలంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలో విద్యుత్ స్థంబాలు తెగిపడ్డాయి. గోరేపల్లి రహదారిలో కూడా చెట్లు విరిగి పడ్డాయి. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. https://www.dharshininews.com/43534/