schedule Saturday, September 05, 2026

బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ

calendar_today June 21, 2026
person dharshininews
బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ
బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ - విద్యార్థి తలకు, చేతికి గాయాలు - టీచర్‌పై పొలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి - తాండూరు మండలం కరణ్‌ కోట్‌లో ఘటన తాండూరు రూరల్‌, దర్శిని ప్రతినిధి : క్లాసు రూంలో విద్యార్థి బూమర్ తింటున్నాడని టీచర్‌ బెత్తం జులిపించింది. దెబ్బలకు విద్యార్థి తలకు, చేతికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్‌కోట్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన తెలూకూరు చిట్టెమ్మ, పాండు దంపతుల మణికంఠను స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యాభాసం చేయిస్తున్నాడు. శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్థి మణికంఠ క్లాసు రూములో బూమర్ వేసుకుని నములుతున్నాడు. గమనించిన టీచర్ బూమర్ ఎందుకు తింటున్నావని కోపంతో మణికంఠను చితకబాదింది. దీంతో విద్యార్థి నెత్తికి, ఎడమ చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. అదే గాయాలతో విద్యార్థి మణికంఠ ఇంటికి వెళ్లాడు. వెంటనే తండ్రి పాండు మణికంఠను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. జరిగిన సంఘటనపై కరణ్‌ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తండ్రి పాండు తెలిపాడు. విద్యార్థిని చితక బాదిన సంఘటనపై పాఠశాల నుంచి ఎలాంటి వివరణ రాలేదు. https://www.dharshininews.com/43582/