schedule Saturday, September 05, 2026

తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌

calendar_today June 23, 2026
person dharshininews
తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌
తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌ - డీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా రవాణా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తాండూరు ఆర్టీసీ కొత్త డీపో మేనేజర్ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు డీపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీపో మేనేజర్‌గా పనిచేసిన సురేష్‌ కుమార్ యాదగిరి గుట్టకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సత్తుపల్లిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కు పదోన్నతి కల్పిస్తూ తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన డీపో మేనేజర్ ప్రవీణ్‌ కుమార్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు రవాణా సమస్యలు లేకుండా బస్సులు నడిపిస్తామని ఆయన తెలిపారు. డీపో అభివృద్ధికి అందరి సహాకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా విధుల్లో చేరిన డీపో మేనేజర్‌కు స్థానిక అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. https://www.dharshininews.com/43599/