schedule Sunday, September 06, 2026

పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి

calendar_today June 26, 2026
person dharshininews
పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి
పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి - అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు నమోదు చేయాలి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణం బూత్ నంబర్ 119 పరిధిలోని శాంతినగర్‌లో బీఎల్వో అధికారి స్వాతికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదు కావాలని, ఎలాంటి లోపాలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ వివరాలను సరిచూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, బీఎల్వో, బీఎల్ఏ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43611/