schedule Wednesday, July 08, 2026

రేపు విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం

calendar_today September 16, 2023
person dharshininews
రేపు విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం
రేపు విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం - హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తాండూరు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు తెలిపారు. ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద మహాయజ్ఞ ఏర్పాట్లు చేయడం జరిగిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం 12-45 గంటలకు నిర్వహిస్తున్న మహాయజ్ఞ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సమాచార, భుగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు అతిథులుగా హజరవుతున్నారని తెలిపారు. వారితో పాటు తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కావున విశ్వకర్మ సంఘం సభ్యులు, పెద్దలు, యువకులు తరలిరావాలని తాండూరు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ చారిలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20303/