schedule Saturday, September 19, 2026

హ్యాట్రిక్ సర్కారుకు కృషి

calendar_today September 19, 2023
person dharshininews
హ్యాట్రిక్ సర్కారుకు కృషి
హ్యాట్రిక్ సర్కారుకు కృషి - బీఆర్ఎస్‌ ప్రతిష్టను పెంచడమే ధ్యేయం - తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటులో తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల సమాచార మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతన్నారు. బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేరుస్తామన్నారు. పథకాలను వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ అందించి హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటులో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20356/