schedule Wednesday, July 08, 2026

పైలెట్ దూకుడుకు తిరుగులేదు

calendar_today September 19, 2023
person dharshininews
పైలెట్ దూకుడుకు తిరుగులేదు
పైలెట్ దూకుడుకు తిరుగులేదు - వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఖాయం - తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్న వయస్సుల్లోనే రాజకీయాల్లో దూకుడుగా ముందుకు దూసుకెళుతున్న పైలెట్ రోహిత్ రెడ్డికి తిరుగులేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు అన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ముందే ఆయన ఈ వాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండల నుంచి పైలెట్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బషీరాబాద్‌ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా జరిగిన ముచ్చటలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మాట్లాడుతూ రోహిత్ రెడ్డి వ్యక్తి కాదు ఓ శక్తి అని అభివర్ణించారు. ఎమ్మెల్యే దూకుడుగా ముందుకెళ్లడం.. జోరుగా అభివృద్ధి చేయడంతో ఈ ఎన్నికల్లో పైలెట్‌కు తిరుగు ఉండదన్నారు. ప్రస్తుతం ఎవరినీ పలకరించినా పైలెట్ కు తిరుగులేదు అంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు సముద్రంలో కలవడం ఖాయమన్నారు. ఈ వాఖ్యలు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నుంచి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, శ్రీశైల్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20370/