schedule Wednesday, July 08, 2026

హరిగౌడ్‌కు సన్మానం

calendar_today September 22, 2023
person dharshininews
హరిగౌడ్‌కు సన్మానం
హరిగౌడ్‌కు సన్మానం - సన్మానించిన అయ్యప్ప ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటి డైరెక్టర్ హరిహర గౌడ్‌కు సన్మానం నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప దేవాయలంలో ఈ కార్యక్రమం జరిగింది. మార్కెట్ కమిటి డైరెక్టర్ గా హరిహరగౌడ్ నియామకం అయిన సందర్బంగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు వెంకట్రావ్, కార్యదర్శి శ్రావణ్‌ గౌడ్, నరహరి, సభ్యులు అనంతయ్య, శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్ తదితరులు ఉన్నారు.   ఇది కూడా చదవండి... https://dharshininews.com/20459/