schedule Saturday, September 19, 2026

వినాయక సెలవిక..!

calendar_today September 22, 2023
person dharshininews
వినాయక సెలవిక..!
వినాయక సెలవిక..! - శ్రీసాయమేధా ద్వారా ఘనంగా గణేష్‌ నిమజ్జనం - ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి సందర్బంగా పూజలందుకున్న గణేషునికి ఘనంగా వీడ్కోలు పలికారు. తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలో ఉన్న శ్రీ సాయిమేధా విద్యాలయంలో ప్రతిష్టించిన వినాకున్ని ఘనంగా నిమజ్జన ఉత్సవం నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం స్కూల్ నుంచి వినాయక నిమజ్జన ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపు ముందు స్కూల్ విద్యార్థుల కొలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్కూల్ నుంచి చేపట్టిన ఊరేగిపు శోభాయామానంగా కొనసాగింది. పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న కాగ్నానదిలో వినాయకున్ని నిమజ్జనం చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20482/