schedule Monday, July 06, 2026

జనహృదయనేత మంత్రి మహేందర్ రెడ్డి

calendar_today September 23, 2023
person dharshininews
జనహృదయనేత మంత్రి మహేందర్ రెడ్డి
జనహృదయనేత మంత్రి మహేందర్ రెడ్డి - మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ - మంత్రి మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ సమాచారం శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని జనహృదయ నేతగా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విటల్ నాయక్ అభివర్ణించారు. శనివారం మంత్రి మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో ఆయనను విఠల్ కలిశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని మహేందర్ రెడ్డికి పుష్పుగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ మహేందర్ రెడ్డి జనహృదయ నేతగా ఎదిగారని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాలాల మండలం ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆశన్న, సప్తగిరి గౌడ్, యాలాల పీఏసిఎస్ వైస్ చైర్మన్ వడ్డె రాములు, అమర్నాథ్ రెడ్డి లాలప్ప శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20525/