schedule Monday, July 06, 2026

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్‌కు సన్మానం

calendar_today September 25, 2023
person dharshininews
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్‌కు సన్మానం
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్‌కు సన్మానం - శుభాకాంక్షలు తెలిపిన శకుంతల దేశ్ పాండే తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్ ను బీఆర్ఎస్ తాండూరు మహిళ కన్వినర్ శకుంతల దేశ్‌పాండే సన్మానించారు. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గా పటేల్ ఉమాశంకర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం మహిళ కన్వీనర్ శకుంతల దేశ్ పాండే గౌతాపూర్‌లో పటేల్ ఉమాశంకర్ ను సన్మానించారు. ఎల్లుండి బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తోన్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి... అభినందించారు. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గా తనదైన ముద్రవేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20590/