schedule Saturday, September 19, 2026

దర్జాగా అక్రమ నిర్మాణం

calendar_today September 27, 2023
person dharshininews
దర్జాగా అక్రమ నిర్మాణం
దర్జాగా అక్రమ నిర్మాణం - మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు - పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదుదారుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణం దర్జాగా చేపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు.   వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం వార్డు నెంబర్ 23లోని వాల్మీకి నగర్ లో జీ. పంచాక్షరీ అనే మహిళ ఇంటినెంబర్ 4-3-35/8 అనే ఇంటిపై అక్రమంగా 1వ అంతస్తు నిర్మాణం చేస్తున్నారు. దీనిపై పక్కింటికి చెందిన జీ. అనురాధ ఈనెల 23వ తాండూరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్రమ నిర్మాణం దర్జాగా జరుగుతోందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20647/