schedule Saturday, September 19, 2026

అక్రమ నిర్మాణాన్ని ఆపేదెవరు..?

calendar_today September 30, 2023
person dharshininews
అక్రమ నిర్మాణాన్ని ఆపేదెవరు..?
అక్రమ నిర్మాణాన్ని ఆపేదెవరు..? - కళ్లుమూసుకున్న మున్సిపల్ అధికారులు - విరుద్దంతో జోరుగా నిర్మాణ పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వార్డు నెంబర్ 23లోని వాల్మీకి నగర్‌లో అక్రమ నిర్మాణం జోరుగా జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని ఎవ్వరు ఆపకపోవడంతో కల్లుమూసుకున్న మున్సిపల్ అధికారులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే వాల్మీకీనగర్‌కు చెందిన జీ. పంచాక్షరీ అనే మహిళ ఇంటినెంబర్ 4-3-35/8 అనే ఇంటిపై అక్రమంగా 1వ అంతస్తు నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రెండు రోజులుగా 1వ అంతస్తులో నిర్మాణ పనులను వేగవంతం చేశారు. దీనిపై పక్కింటికి చెందిన జీ. అనురాధ ఈనెల 23వ తాండూరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతగల అధికారులే ఆపకుంటే ఇంకెవరు ఆపుతారని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతా అధికారులు అయినా పట్టించుకుని అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20703/