schedule Monday, July 06, 2026

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

calendar_today October 8, 2023
person dharshininews
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - ఉత్సహాంగా గడిపిన అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అంబేద్కర్ సెంటీనరీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా. జరుపుకున్నారు. ఆదివారం కళాశాలకు చెందిన 1999-2000 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పట్టణంలోని హిమాలయ హోటల్లో పూర్వ విద్యార్థుల విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్ కు చెందిన అందరు విద్యార్థులు ఒకే చోట కలుసుకున్నారు. అప్పటి అద్యాపకులను, విద్యార్థులను కలుసుకుని ఈ సంతోష పడ్డారు. చదువుకునే రోజుల్లో చేసిన అల్లర్లను, సందడిలను నెమరువేసుకున్నారు. అనంతరం అప్పటి కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, అధ్యాపకులు సంగీత, బాల్ రెడ్డి, ఇందిర, సవిత, భారతి, కాశిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించారు. మరోవైపు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పూర్వ విద్యార్థులు సందడిగా గడిపారు. ఇది కూడ చదవండి.. https://dharshininews.com/20896/