schedule Saturday, September 19, 2026

సాయిపూర్‌లో శివాజీ విగ్రహ స్థాపన

calendar_today October 9, 2023
person dharshininews
సాయిపూర్‌లో శివాజీ విగ్రహ స్థాపన
సాయిపూర్‌లో శివాజీ విగ్రహ స్థాపన - భూమి పూజ చేసిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయిపూర్ లోని 9వ వార్డు వీర్ శివాజీ కాలనీలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన స్థలాన్ని ఎంపిక చేశారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హాజరై వార్డు ప్రజలతో కలిసి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విగ్రహా ప్రతిష్టాపనకు స్థలం ఇచ్చిన కావేరీ వాటర్ ప్లాంట్ నిర్వహకులు పట్లోళ్ల వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపనకు చేయూతనందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల వెంకటేష్. మరాఠీ నర్సింలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20916/