schedule Monday, July 06, 2026

ప్రతి ఇంటికి గ్యారెంటీ పథకాలు..!

calendar_today October 11, 2023
person dharshininews
ప్రతి ఇంటికి గ్యారెంటీ పథకాలు..!
ప్రతి ఇంటికి గ్యారెంటీ పథకాలు..! - మోసపూరిత బీఆర్ఎస్ ను నమ్మొద్దు - కాంగ్రెస్ నాయకులు బుయ్యని మనోహర్ రెడ్డి - తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పథకాలపై ప్రచారం - కాంగ్రెస్‌లో చేరిన 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటింటి గ్యారెంటీ పథకాలను అమలు చేయడం పక్కా జరుగుతుందని ఆ పార్టీ నాయకులు బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నేతలు డాక్టర్ సంపత్ కుమార్, మైనార్టీ నాయకులు అబ్దుల్లా అమేర్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులతో కలిసి హాజరయ్యారు. వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, యువ వికాసం, చేయూత పథకాలపై ప్రజలకు వివరించి చైతన్య పరిచారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి తీరుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటింటికి గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతుందన్నారు. తొమ్మిందేండ్లుగా ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దన్నారు. కాంగ్రెస్లో బీఆర్‌ఎస్ కార్యకర్తల చేరిక మరోవైపు తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ వార్డు నెంబర్ 5లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై దాదాపు 200ల మంది పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బుయ్యని మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కారుడు నాగేందర్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఎండీ బషీర్, ఖయ్యూం, నవాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20979/