schedule Monday, July 06, 2026

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

calendar_today October 12, 2023
person dharshininews
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు - కండువా కప్పుకున్న సునితా సంపత్ - రేవంత్ రెడ్డి సమక్షంలో మరికొంత మంది చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద తాండూరుకు చెందిన నేతలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గాంధీ భవన్ కార్యక్రమంలో భాగంగా తాండూరు నుంచి నేతలు, నాయకులు భారీగా తరలివెళ్లారు. అక్కడ టీపీసీపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ఇందులో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్, డీసీసీబీ మాజీ చైర్మన్ కుమారుడు మహిపాల్ రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మనోహర్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కలాల్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. https://www.youtube.com/watch?v=RpgUK63L75U&t=13s ఇది కూడా చదవండి.. https://dharshininews.com/21012/