schedule Saturday, September 19, 2026

కారుకు షాకిచ్చిన సర్పంచులు

calendar_today October 12, 2023
person dharshininews
కారుకు షాకిచ్చిన సర్పంచులు
కారుకు షాకిచ్చిన సర్పంచులు - బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిక - ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గులాబీ పార్టీకి చెందిన తాండూరు మండల సర్పంచులు కారుకు షాక్‌ ఇచ్చారు. కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సంఘటన తాండూరు మండలంలో చర్చనీయాంశమైంది. గురువారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి సమక్షంలో మండలంలోని చంద్రపంచ సర్పంచ్ విజయ్ కుమార్, గుంతబాస్పల్లి సర్పంచ్ జగదీష్, వీరారెడ్డిపల్లి సర్పంచ్ శ్రీఇనవాస్, గుండ్లమడుగు తాండా సర్పంచ్ దశరథు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఒక్కసారిగా సర్చంచులు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్ తగిలింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21020/