schedule Saturday, September 19, 2026

చెక్ పోస్టు వద్ద రూ.2.38 లక్షలు సీజ్..!

calendar_today October 13, 2023
person dharshininews
చెక్ పోస్టు వద్ద రూ.2.38 లక్షలు సీజ్..!
చెక్ పోస్టు వద్ద రూ.2.38 లక్షలు సీజ్..! - స్వాధీనం చేసుకున్న కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మండలంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కరణ్ కోట్ పోలీస్టేషన్ ఆధ్వర్యంలో కొత్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని మిట్టబాస్పల్లికి చెందిన రాథోడ్ శంకర్ అనే వ్యక్తి బైకుపై వస్తుండగా సోదాలు చేశారు. దీంతో అతని వద్ద రూ.2లక్షల 38 వేల నగదును గుర్తించారు. అట్టి నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేయడం జరిగిందని కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ2 విమల, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21048/