schedule Saturday, September 19, 2026

ఘనంగా బతుకమ్మ వేడుకలు

calendar_today October 13, 2023
person dharshininews
ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఘనంగా బతుకమ్మ వేడుకలు - శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి టీచర్లు, విద్యార్థులు ఆడి పాడారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటి చెబుతుందని తెలిపారు. తెలంగాణ జీవన విధానానికి ప్రతిబింబంగా బతుకమ్మ అద్దం పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21057/