schedule Monday, July 06, 2026

మెనిఫెస్టోతో హాట్రిక్ గేర్..!

calendar_today October 15, 2023
person dharshininews
మెనిఫెస్టోతో హాట్రిక్ గేర్..!
మెనిఫెస్టోతో హాట్రిక్ గేర్..! - కారు స్పీడ్‌కు అపోజిషన్ ఖేల్ ఖతం - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - కేసీఆర్ మెనిఫెస్టో ప్రకటనపై హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మెనిఫెస్టోతో హాట్రిక్ సర్కారు గేర్ వేశారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆసరా ఫించన్ రూ. 5 వేలకు పెంపు. వికలాంగ ఫించన్ రూ. 6 వేలకు పెంపు, రూ.400లకే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ, రైతు బందు సాయం రూ. 16వేలకు పెంపు వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోతో అనేక హామీలు ప్రకటించిన కేసీఆర్ కేసీఆర్ ఆపోజిషన్ పార్టీల ఖేల్ ఖతం అయ్యేలా చేశారని అన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలకు మాటలు కరువయ్యాయన్నారు. బీఆర్ఎస్ నేత ప్రకటించిన మెనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన హామిలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతో కేసీఆర్ హాట్రిక్ సర్కారుగా ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21098/