schedule Monday, July 06, 2026

సంక్షేమం, అభివృద్దే గులాబీ ఎజెండా

calendar_today October 16, 2023
person dharshininews
సంక్షేమం, అభివృద్దే గులాబీ ఎజెండా
సంక్షేమం, అభివృద్దే గులాబీ ఎజెండా - తెలంగాణ హాట్రిక్ సర్కారు పక్కా - పార్టీ గెలుపుకు అందరు సైనికుల్లా పనిచేయాలి - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - చైతన్యం నింపిన శిక్షణ తరగతులు తాండూరు, దర్శిని ప్రతినిధి: సంక్షేమం, అభివృద్ధే ఎజెండాతో గులాబీ పార్టీ ఎన్నికల్లో దూసుకెళుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ ఉపన్యాసకులు డా. గంప నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశం ఆశ్చర్య పోయేలా బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను ప్రవేశ పెట్టారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని నిరూపించారని అన్నారు. సకల జనుల మెనిఫెస్టోతో బీఆర్ఎస్ పార్టీ హాట్రిక్ కోట్టడం ఖాయమని, మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ షార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోందన్నారు. ఈ శిక్షణ తరగతులను ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా డా. గంప నాగేశ్వర్ రావు, లక్ష్మణ్ ల ఉపన్యాస శిక్షణ తరగతులు పార్టీలో చైతన్యం కలిగించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21115/