schedule Monday, July 06, 2026

పైలెట్ స్పీడ్ గేర్..!

calendar_today October 18, 2023
person dharshininews
పైలెట్ స్పీడ్ గేర్..!
పైలెట్ స్పీడ్ గేర్..! - తొలిరోజు శంఖారావ సభలు సక్సెస్ - అభివృద్ధి, సంక్షేమ మంత్ర ప్రయోగం - ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు - రోహిత్ రెడ్డికి సభలకు జనం జేజేలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అన్నీ ఫార్మట్లలో ముందు ఉంది. అన్ని పార్టీల కంటే దూకుడుగా సాగుతోంది. అదే స్పూర్తితో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి కారులో స్పీడ్ గేర్ వేశారు. బీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టో ప్రకటన తరువాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జోష్‌ను పెంచారు. మెనిఫెస్టో రెండో రోజు నుంచే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. విజయమే ధ్యేయంగా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాలకు సంబంధించి శంఖారావ సభలను నిర్వహించారు. యాలాల మండలం అగ్గనూర్ సమీపంలో బషీరాబాద్‌ మండల సభ, పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో పెద్దేముల్, కోట్‌పల్లి మండల శంఖారావ సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ సభల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గం చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రసంగ మంత్రంతో ముగ్దుల్ని చేశారు. ఓవైపు విజయం కోసం ప్రచారం చేస్తూనే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పదునైన విమర్శలతో ద్వజమెత్తారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ చేసే కుట్రను బయటపెట్టడం జరిగిందని గుర్తుచేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు కావడంతో పక్క నియోజకవర్గాల నుంచి అరువు తెచ్చుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను అశీర్వదించి గెలిపించాలని చేస్తున్న పైలెట్ ప్రచారానికి సభకు వచ్చిన జనాలు జేజేలు పలుకుతున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21139/