schedule Friday, September 18, 2026

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత

calendar_today October 19, 2023
person dharshininews
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత - కుటుంబాన్ని ఓదార్చిన డీఎం సమతా రెడ్డి - విచారం వ్యక్తం చేసిన తోటి ఉద్యోగులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గుండెపోటు ఆర్టీసీ సీనియర్ కండక్టర్ కన్నుమూశారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఆర్టీసీ డీపోలో రేణుక తొలి మహిళా కండక్టర్ గా విధుల్లో చేరారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో ఇంటో కుర్చీలో కూర్చొని ఉండగా ఛాతీ లో నొప్పి వస్తుందని అస్వస్థత కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ సమత, ఆర్టీసీ సిబ్బంది పార్టివ దేహానికి నివాళులు అర్పించారు. డిపో మేనేజర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు.