schedule Saturday, September 19, 2026

సూపర్ అవ్వ..!

calendar_today October 19, 2023
person dharshininews
సూపర్ అవ్వ..!
సూపర్ అవ్వ..! - ఎమ్మెల్యేకు నెల ఫించన్ విరాళం - ఫిదా అయిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తమకు మంచి చేసిన మహాత్ములను నాయకులను మనషులు ఎవ్వరు మరిచిపోరు. వారికి ఏదో విధంగా కృతజ్ఞతగా తోచిన సాయం అందిస్తుంటారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చిరుసాయం అందించి సూపర్ అనిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పెద్దేముల్ మండలం గొట్లపల్లి వద్ద తాండూరు పట్టణ బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావ సభ నిర్వహించారు. ఈ సభ వేదిక వద్దకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు పట్టణానికి చెందిన షాహీదా భేగం అనే వృద్ధురాలు ఎన్నికల ఖర్చు కోసం చిరుసాయం అందించారు. తనకు ప్రభుత్వం అందిస్తున్న అసరా ఫించన్ ఓ నెలకు సంబంధించిన డబ్బులను విరాళంగా అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిదా అయిపోయారు. తనపై అభిమానంలో ఫించన్ డబ్బులను అందించిన వృద్ధురాలుతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుని అభినందించారు. అదేవిధంగా ఎమ్మెల్యేకు చిరుసాయం అందించిన వృద్ధురాలు స్థానిక నేతలు సూపర్ అంటూ అభినందించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21181/