schedule Monday, July 06, 2026

నేల పూసిన పూలవనం..!

calendar_today October 21, 2023
person dharshininews
నేల పూసిన పూలవనం..!
నేల పూసిన పూలవనం..! - చెంగోల్‌లో వైభంగా బతుకమ్మ సంబరాలు - హాజరైన ఎమ్మెల్యే సతీమణీ ఆర్తిరెడ్డి - సందడిగా ఆడిపాడిన మహిళలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలను తాండూరు మండలంలో ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం మండలంలోని చెంగోల్ గ్రామం పూలవనంగా మారింది. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మను అందంగా ముస్తాబు చేశారు. ఇంటింటి నుంచి బతుకమ్మలను తీసుకవచ్చిన మహిళలు పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తీరెడ్డి హాజరై సందడి చేశారు. గ్రామ సర్పంచ్ మళ్లీశ్వరీ గౌడ్, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. దీంతో గ్రామంలో బతుకమ్మ సంబరాల శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అన్నారు. ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21217/